ఆవు దాడిలో దారుణంగా చనిపోయిన వ్యక్తి

ఆవు దాడిలో దారుణంగా చనిపోయిన వ్యక్తి

 ఆవు భీభత్సం సృష్టించింది. రెచ్చిపోయి ఓ వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది. 

రాను రాను జంతువులు కూడా ఆవేశాలకు లోనవుతున్నాయి.  అడవిలో ఉండే క్రూర మృగాలు దాడులకు పాల్పడుతున్నాయంటే వాటి నైజం అనుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు విన్నాం. కాని ఇప్పుడు తాజాగా సాధు జంతువైన ఆవులు కూడా ప్రజలపై ప్రతాపాన్ని చూపుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆవు బీభత్సం సృష్టించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

Elderly man dies after stray cow drags him for about 100 meters, collides with several vehicles in Punjab's Mohali.

The deceased was identified as 83-year-old Saroop Singh.#Punjab #Mohali pic.twitter.com/kCuRcpDAMM

— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2023 >

పంజాబ్ లో ఓ వృద్దుడిపై దాడి చేసింది.   100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో పెద్దాయన కన్నుమూసాడు. సీసీటీవీలో రికార్డైన విజువల్స్ షాక్‌కి గురిచేసాయి. మొహాలీలోని పన్‌లో ఓ ఆవు విపరీతంగా ప్రవర్తించింది. పగబట్టినట్లు 83 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. తనను రక్షించుకోవడానికి ఆ పెద్దాయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనలో చనిపోయిన పెద్దాయన పేరు సరూప్ సింగ్‌గా తెలుస్తోంది. ఆవు అతనిని ఈడ్చుకెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


పంజాబ్‌లోని మొహాలీలో ఓ ఆవు దాడి చేయడంతో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రద్దీగా ఉండే రోడ్డుపై ఆవు అతడిని 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాయి. అదుపు తప్పిన ఆవు తన ఇంట్లోకి ప్రవేశించడంతో బాధితుడు సరూప్ సింగ్ అనే వ్యక్తి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆవును బయటకు పంపే ప్రయత్నంలో ... సింగ్‌పై  ఆవు దాడి చేసింది.  ఈ ఘటనను అక్కడ ఉన్న  CCTV ఫుటేజీ క్యాప్చర్ చేసింది.  ఆవు ఈడ్చుకెళ్తుండగా పలు వాహనాలు ఆయనను ఢీకొట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు  నెటిజన్లు షాకయ్యారు.