పదోన్నతులు బాధ్యత పెంచుతాయి : సీపీ అనురాధ

పదోన్నతులు బాధ్యత పెంచుతాయి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని, జీవన శైలిని  మార్చే విధంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయని సీపీ అనురాధ అన్నారు. గురువారం సీపీ ఆఫీసులో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన టి. రాజేశం, యస్. ఉదయ్ కుమార్, కె. సుధాకర్ రెడ్డి, వి. యేసు స్వామి, కె. రవిరాజు, యాదయ్య, కె.అంజిరెడ్డి లు సీపీని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..  పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయనన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ కిరణ్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.