మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత .. ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేసిన బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత .. ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేసిన బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

గచ్చిబౌలి, వెలుగు: గుండె పోటుతో మృతి చెందిన కానిస్టేబుల్​ కుటుంబానికి 2011 బ్యాచ్​కు చెందిన అతని బ్యాచ్​మెట్స్​ చేయూతనిచ్చారు. 15 లక్షల విలువైన ఓపెన్​ ప్లాట్​ను సైబరాబాద్ సీపీ అవినాష్​ మహంతి చేతుల మీదుగా గురువారం కానిస్టేబుల్​ కుటుంబానికి అందజేశారు. సైబరాబాద్​ కమిషనరేట్​ మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​లో 2011 సివిల్​ బ్యాచ్​కు చెందిన పర్మగల్ల యాదయ్య కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు.

2023 ఆగస్టు 8వ తేదిన గుండెపోటుతో మృతి చెందాడు. ఇతనికి భార్య పూజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాదయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ సిబ్బంది,  2011 బ్యాచ్​కు చెందిన సైబరాబాద్​, రాచకొండ, కరీంనగర్​లకు చెందిన బ్యాచ్​మెట్లు అందరూ కలిసి రూ.15లక్షలు కలెక్ట్​ చేశారు. వీటితో శంషాబాద్​లోని పెద్ద షాపూర్​ వద్ద యాదయ్య పిల్లల పేరుతో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్​ను గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్​ కమిషనరేట్​ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  సీపీ అవినాష్​ మహంతి చేతుల మీదుగా యాదయ్య కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాదాపూర్​ డీసీపీ వినీత్​, మాదాపూర్​ ఇన్​స్పెక్టర్​ మల్లేశ్, 2011 బ్యాచ్​కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.