
హైదరాబాద్ లో శనివారం ( సెప్టెంబర్ 6 ) గణేష్ నిమజ్జనం ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గణేష్ నిమజ్జనం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శనివారం ఉదయం 6 గంటల నుండి ఖైరతాబాద్ వినాయకుని నిమర్జనం మొదలౌతుందని.. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. నిమజ్జనం కోసం 29 వేల మంది పోలీసులు అందుబాటులో ఉన్నారని అన్నారు. సిటీ పోలీసులు 20 వేల మంది, జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు 9 వేల మంది అందుబాటులో ఉన్నారని అన్నారు.
గతంలో వర్షం పడ్డ సమయంలో జనాన్ని కంట్రోల్ చేయలేక ఆరుగురు మృత్యువాత పడ్డారని.. ఈసారి అలంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు.ఎన్టీఆర్ మార్గ్ , పీపుల్స్ ప్లాజా వద్ద నిమర్జనం చేయటానికి క్రేన్లు ఏర్పాటు చేశామని.. గణేష్ మండపాల దగ్గర స్థానిక పోలీసుల సలహాలను పాటించాలని అన్నారు. గురువారం రాత్రి ఒక వినాయక విగ్రహం ఎత్తుగా ఉండటం వల్ల 6 గంటల వరకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగిందని అన్నారు.విగ్రహాల ఎత్తుల ప్రకారం స్థానిక పోలీసు అధికారులతో కలిసి రూట్ మ్యాప్ తయారుచేశామని అన్నారు.
►ALSO READ | సెప్టెంబర్ 6న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..
సౌండ్ పొల్యూషన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని.. తద్వారా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.ఈ క్రమంలో భాగ్యనగర్ ఉత్సవ సమితితో మాట్లాడి డీజే సౌండ్స్ పై నిషేధం విధించామని అన్నారు. జిహెచ్ఎంసీతో కలిసి రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నామని.. ట్రాఫిక్ సమస్యలు కలుగకుండా రూట్ డైవర్షన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీవీ ఆనంద్.ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రకు ఏర్పాటు సిద్ధం చేస్తున్నామని అన్నారు. హుస్సేన్ సాగర్ లో 50 వేల విగ్రహాల వరకు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని అన్నారు సీపీ సీవీ ఆనంద్.