సెప్టెంబర్ 6న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..

సెప్టెంబర్ 6న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..

హైదరాబాద్ లో శనివారం ( సెప్టెంబర్ 6 ) గణేష్ శోభాయాత్ర ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. బాలాపూర్ నుంచి చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ మీదుగా ప్రధాన శోభాయాత్ర మొదలవుతుంది. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదు.

ఈ క్రమంలో బాలాపూర్ గణేష్ శోభాయాత్ర రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఈ రూట్లో శనివారం ( సెప్టెంబర్ 6 ) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ( సెప్టెంబర్ 7 ) ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు.

బాలాపూర్ గణేశ్ రూట్ మ్యాప్:

కట్ట మైసమ్మ దేవాలయం - కేశవగిరి - చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ - ఇంజన్ బౌలి - అలియాబాద్ -నాగుల్ చింత జంక్షన్ - హిమ్మత్ పురా - చార్మినార్ -మదీనా క్రాస్ రోడ్ - అఫ్జల్ గంజ్ - ఎంజే మార్కెట్ - అబిడ్స్ జీపీఓ బీజేఆర్ విగ్రహం - బషీర్ బాగ్ క్రాస్ రోడ్ - లిబర్టీ -అంబేడ్కర్ విగ్రహం - ట్యాంక్ బండ్.

ALSO READ : హైదరాబాద్ మెట్రో నాన్ స్టాప్ సర్వీసులు

పీక్ అవర్స్ లో ఆర్టీసీ బస్సుల రూట్లు:

ఆర్టీసీ బస్సులు పీక్ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే నడుస్తాయి. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సుల విషయానికొస్తే.. చాదర్‌ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లింపు. 

దాటకూడని జంక్షన్లు: ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా. విమానాశ్రయం వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్–ప్యారడైజ్ రూట్ వాడాలి. నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-27852482, 8712660600, 9010203626.