రౌడీషీటర్ల కేసుల విచారణకు స్పెషల్ బెంచ్

రౌడీషీటర్ల కేసుల విచారణకు స్పెషల్ బెంచ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రౌడీషీటర్లపై సీపీ సీవీ ఆనంద్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనకున్న అడిషనల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌ అధికారాలతో రౌడీ షీటర్లపై నమోదైన కేసులను విచారిస్తున్నారు. ఇందుకోసం బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్‌‌‌‌ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో శనివారం స్పెషల్‌‌‌‌ బెంచ్‌‌‌‌ ఏర్పాటు చేశారు.కోర్టు తరహాలోనే చైర్‌‌‌‌‌‌‌‌, కేసులకు సంబంధించిన ఫైల్స్ అందించేందుకు క్లర్క్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. 107 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ ప్రొసీడింగ్స్‌‌‌‌ కింద నమోదైన కేసులను పరిశీలిస్తున్నారు.

సిటీలో లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కి విఘాతం కలిగించే రౌడీషీటర్లను ప్రశ్నిస్తున్నారు .రూల్స్​ ప్రకారం ష్యూరిటీలు,బాండ్‌‌‌‌ డిపాజిట్ చేయిస్తున్నారు.మొదటి రోజు విచారణలో రెయిన్‌‌‌‌ బజార్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో నమోదైన కేసులను పరిశీలించారు. నిందితులు రూ.25 వేలు, - ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.