
హైదరాబాద్లో గతేడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు రెండు శాతం, దోపిడీలు తొమ్మది శాతం మేర పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో నగర వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు3 శాతం మేర పెరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులు పై 12% తగ్గిన నేరాలు తగ్గాయన్నారు. ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు పడ్డాయని చెప్పారు. 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్దాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికలు సహా ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించాం. కొన్నేండ్ల తర్వాత గణేశ్ నిమజ్జనోత్సవం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో మత పెద్దల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయి. మహిళలపై రేప్ కేసులు 2022లో 343 ఉంటే.. ఈ ఏడాది 403 నమోదయ్యాయి. సైబర్ నేరాలు 11 శాతం పెరిగాయి. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్ల మోసాలు జరిగితే ఈసారి రూ.133 కోట్లను కేటుగాళ్లు కాజేశారు.
ఆర్థిక నేరాలపై 2022లో 292 కేసులు నమోదైతే.. 2023లో స్పల్పం (344)గా పెరిగాయి. పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయి. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్పిపర్ డాగ్స్‌ను వినియోగిస్తం. సోషల్ మీడియాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నం’ అని సీపీ పేర్కొన్నారు.
అంతేకాకుండా న్యూ ఇయర్ రోజున డ్రంక్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి అని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించినా , సప్లై చేసిన కఠిన చర్యలు ఉంటాయన్నారు.