టైర్ల లారీ చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

టైర్ల లారీ చోరీ కేసులో నలుగురు నిందితులు అరెస్ట్

ఫిబ్రవరి 17న తమిళనాడు నుంచి వస్తున్న MRF టైర్ల్ లారీని దొంగతనం చేసిన కేసులో హైదరాబాద్ రాచకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

తమిళనాడు నుంచి 192 MRF టైర్లతో  హైదరాబాద్ వస్తున్న లారీని ఆపారు హర్యానా గ్యాంగ్ కు చెందిన జంషెద్ ఖాన్, రహీల్ ఖాన్ లు. లిఫ్ట్ కావాలని చెప్పి పహాడీ షరీష్ లో టైర్ల లారీ ఎక్కారు. ఎక్కిన వెంటనే తుపాకీ చూపించి డ్రైవర్, క్లీనర్‌ను తాళ్లతో కట్టి క్యాబిన్ లో పడేశారు. అక్కడి నుంచి లారీని కాటేదాన్ తీసుకువచ్చి అక్కడ ఒక గోదాంలో 192 టైర్లను అన్ లోడ్ చేశారు. ఆ తర్వాత లారీని ఊరి చివరకు తీస్కెళ్లి వదిలేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు జంషెద్ ఖాన్ ఇప్పటికే విమానంలో ఢిల్లీ పారిపోయాడు. తుపాకీతో విమానంలో వెళితే ఇబ్బంది అని తుపాకీని రహీల్ ఖాన్ కు అప్పగించి ఢిల్లీ వెళ్లాడు. రాచకొండ పోలీసులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అతడ్ని ఢిల్లీ ఎయిర్ పోర్ట్, సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టైర్లను పహడీ షరీఫ్ నుంచి కాటేదాన్ గోదాంకు తరలించిన సయ్యద్ బాసిత్ హుసేన్ , కమల్ కబ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిచ్చిన సమాచారంతో రహీల్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకోసం గాలింపు చేపట్టామని తెలిపారు సీపీ మహేష్ భగవత్.

ఈ గ్యాంగ్ జనవరి 18 తేదీన అపోలో టైర్ల తో వెళుతున్న 220 టైర్లు లారీ ని ఇలాగే దోపిడీ చేశారని….ఇప్పటి వరకు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదని ఆయన వివరించారు. ఈ కేసు విచారణ కోసం …..తమిళనాడు , హరియానా కి టీమ్స్ పంపించి విచారణ చేస్తామని చెప్పారు.

మరిన్ని  వార్తల కోసం..

తెలంగాణ సమాజం నిన్ను చూసి నవ్వుతోంది కేసీఆర్