అత్యాశ వద్దు.. అప్రమత్తంగా ఉండాలి : సీపీ రంగనాథ్ 

అత్యాశ వద్దు.. అప్రమత్తంగా ఉండాలి : సీపీ రంగనాథ్ 
  • సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాల కట్టడికి అదొక్కటే మార్గం
  • ప్రజల్లో అవేర్ నెస్ తెచ్చేందుకు పోలీసుల కొత్త యాక్షన్ ప్లాన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు: అత్యాశ, అవగాహన లేకపోవడమే సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలు పెరిగేందుకు ప్రధాన కారణమని సిటీ జాయింట్ సీపీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. కేసుల నమోదు, దర్యాప్తు ఒక్కటే సైబర్ నేరాలకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన వస్తే తప్ప కట్టడి చేసే అవకాశం లేదని తెలిపారు. నేరగాళ్లు దొరికినా.. బాధితులు కోల్పోయిన డబ్బు రికవరీ చేయడం కష్టమని చెప్పారు. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేరాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గురువారం కో– ర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రైమ్స్ డీసీపీ కవిత, ఏసీపీ శివ మారుతితో కలిసి ఆయన సైబర్ క్రైమ్ వివరాలు వెల్లడించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీడియా,రేడియో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ప్రతినిధుల వద్ద సలహాలు సూచనలు తీసుకున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు.

కొట్టే సేది కొండంత..

సాధారణ నేరాలతో పోల్చితే సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాళ్లతో కూడిందని తెలిపారు. సిటీలో రోజుకు సుమారు 10 –15 కేసుల నమోదవుతుండగా రాష్ట్రవ్యాప్తంగా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. అత్యాశకు పోయి బాధితులు రూ.కోట్లు కోల్పోతున్నారన్నారు. ప్రతి ఏటా నమోదయ్యే సైబర్ క్రైమ్ కేసుల్లో యువత, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విద్యావంతులే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారన్నారు. కమీషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చాలా మంది హైదరాబాదీలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారన్నారు. అరెస్ట్ అయ్యేదాకా సైబర్ నేరాన్ని గుర్తించలేకపోతున్నారని చెప్పారు.

కొత్త యాక్షన్ ప్లాన్

సైబర్ నేరాల నియంత్రణకు కొత్త యాక్షన్ ప్లాన్ రూపొందించామని జాయింట్ సీపీ పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ట్రాఫిక్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో సైబర్ నేరాలు, బాధితులు కోల్పోతున్న డబ్బుపై ఎప్పటికప్పుడు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ ఇస్తామని చెప్పారు. క్రైమ్ జరిగిన 1 నుంచి 2 గంటల్లోపు గోల్డెన్ అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తామన్నారు. డబ్బులు పోతే  వెంటనే 1930కి ఫిర్యాదు చేస్తే ఫ్రీజ్ చేస్తామని వెల్లడించారు.