నిజామాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలీసులు నిష్పక్షపాతంగా డ్యూటీలు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దన్నారు. మంగళవారం ఆయన జిల్లాలోని పోలీస్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. సామాన్య ప్రజలకు నమ్మకం, భద్రత కలిగించేలా విధులు నిర్వహించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు.
ఫిర్యాదులు రాగానే స్పందించాలని, సోషల్ మీడియా వ్యాప్తిచెందే అబద్ధాలను నియంత్రించాలన్నారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు శ్రీనివాస్, రాజా వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్అలీ, ఎస్బీ సీఐ శ్రీశైలం, ఇన్ స్పెక్టర్ అంజయ్య, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ వీరయ్య ఉన్నారు.
కొవిడ్ మరణాల కంటే ఎక్కువ మంది మృతి
కరోనా టైంలో మృతి చెందినవారికంటే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని సీపీ సాయిచైతన్య అన్నారు. కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించిన వ్యక్తులు బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించడానికి వెనకాడుతున్నారని అన్నారు.
రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అరైవ్, అలైవ్ పేరుతో రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించిన ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపొద్దని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక వేసుకోవాలన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు హుసామొద్దీన్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉమామహేశ్వర్రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆనంద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ ఉన్నారు.
