
నిజామాబాద్, వెలుగు : మహిళా కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో రాణిస్తున్నారని, ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుని చాకచక్యంగా పని చేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. సోమవారం తన ఆఫీస్ ప్రాంగణంలో వారం రోజుల పాటు కొనసాగే స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్నాలు, రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు, రాబోవు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మహిళా స్టాఫ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలపై అవగాహన కల్పించారు. మహిళా పోలీసులు డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పీఈటీ, పీడీ, రెజ్లింగ్, జూడోలో నేషనల్ పతకాలు పొందిన వారిని భాగస్వామ్యులను చేస్తామన్నారు. అదనపు డీసీపీ (ఏఆర్) రాంచందర్‌రావు, నగర ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు సతీశ్, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణిలో 27 ఫిర్యాదులు..
పోలీస్ ప్రజావాణి ప్రారంభించిన మూడో సోమవారం పౌరుల నుంచి 27 ఫిర్యాదులు అందాయి. సీపీ సాయిచైతన్య ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత ఠాణా ఎస్‌హెచ్‌వోలతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, భార్యభర్తలు, యువకులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీపీ వివరించారు.