రక్తదానం సామాజిక బాధ్యత : సీపీ సాయి చైతన్య

రక్తదానం సామాజిక బాధ్యత : సీపీ సాయి చైతన్య

బాల్కొండ/ఆర్మూర్​, వెలుగు :  రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సీపీ సాయి చైతన్య అన్నారు. బుధవారం పోలీస్ సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా బాల్కొండ, ఆర్మూర్​లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను వీడాలని సూచించారు. అత్యవసర సమయం, ప్రమాద స్థితిలోఉన్నవారితోపాటు తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుందన్నారు.  

పోలీస్ స్టాఫ్, యువకులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్,  రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై శైలేందర్, సిబ్బంది పాల్గొన్నారు.  

రక్తదానం చేసినవారికి హెల్మెట్లు అందజేత

నిజామాబాద్ : రక్తదానం చేసిన  177 మంది పోలీసులు, సిబ్బందికి సీసీ సాయిచైతన్య హెల్మెట్లు అందజేశారు.  పోలీసులు రక్తదానంతో మానవత్వం చాటారని కితాబునిచ్చారు.  అదనపు డీసీపీ రాంచందర్​రావు, ఏసీపీలు రాజావెంకట్​రెడ్డి,  మస్తాన్​అలీ, యూనిట్​ ఆఫీసర్​ సరళ తదితరులు ఉన్నారు. ఎర్గెట్ల మండల కేంద్రంలో నిర్వహించిన కమ్యూనిటీ కంటాక్ట్​ ప్రొగ్రామ్​లో డ్రగ్స్​కు దూరం పాటించాలని సీపీ కోరారు.