ఆర్మూర్‌‌‌‌లో గణేశ్ నిమజ్జనానికి సహకరించాలి : సీపీ సాయి చైతన్య

ఆర్మూర్‌‌‌‌లో గణేశ్ నిమజ్జనానికి సహకరించాలి :  సీపీ సాయి చైతన్య

ఆర్మూర్, వెలుగు: గణేశ్​నిమజ్జనోత్సవానికి ప్రజలు సహకరించాలని సీపీ సాయి చైతన్య అన్నారు. ఆదివారం ఆర్మూర్‌‌‌‌లో గూండ్ల చెరువును సీపీ పరిశీలించి మాట్లాడారు. చెరువు వద్ద ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని, రోడ్లపై గుంతలను పూడ్చి, చెరువు వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. 

పది ఫీట్ల ఎత్తు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం రోజు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, మున్సిపల్, పోలీసులు, తహసీల్ అధికారులు, సిబ్బంది అలర్ట్​గా ఉండాలన్నారు. పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వో సత్యనారాయణ గౌడ్‌‌‌‌లకు సూచించారు.