
హైదరాబాద్, వెలుగు: కంప్యూటర్ నెట్‌వర్క్స్‌పై సైబర్ దాడులకు అవకాశముందని, అలర్ట్‌గా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. పర్సనల్, బిజినెస్ సంస్థలను టార్గెట్ చేసి సైబర్ క్రిమినల్స్ ఆన్‌లైన్ దోపిడీకి పాల్పడే ప్రమాదముందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న ప్రచారాన్ని సైబర్ క్రైమినల్స్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. కరోనా వైరస్ మ్యాప్స్, ఫేక్ వెబ్ సైట్స్, మాల్ వేర్, స్పై వేర్, ట్రోజన్ లింక్స్‌ను డెస్క్ టాప్, మొబైల్స్ కి పంపిస్తున్నారు. ఆ మాల్ వేర్ లింక్స్ క్లిక్ చేస్తే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేస్తారు.
మాల్ వేర్, ఫిషింగ్, స్పామ్‌తో సైబర్ క్రైమ్ చేసేందుకు ‘కరోనా వైరస్, కరోనా–వైరస్, కోవిడ్ 19, కోవిడ్–19 పేరుతో డైలీ వేల సంఖ్యలో ఫేక్ ఇంటర్నెట్ డొమైన్లు క్రియేట్ చేస్తున్నారు. వాటితో జాగ్రత్తగా ఉండాలి. ర్యాన్సంవేర్ తో హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్, ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేసే అవకాశముంది. ఇ–మెయిల్స్ కి లింక్స్ పంపి డెస్క్ టాప్ లోకి ర్యాన్సంవేర్ పంపొచ్చు. మన సిస్టమ్ పనిచేయకుండా చేసి డబ్బు డిమాండ్ చేసే ప్రమాదముంది.
పీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో సైబర్ క్రిమినల్స్ ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. pmcares @ sbi మాత్రమే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఐడీ. pmcares @ pnb, pmcares @ hdfcbank, pmcare @ yesbank, pmcare @ ybl, pmcares @ icici పేరుతో ఉన్న ఫేక్ యూపీఐ ఐడీలను నమ్మొద్దు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) ప్రతినిధుల పేరుతో ఎవరైనా ఫోన్, మెయిల్ చేస్తే నమ్మొద్దు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వారితో షేర్ చేసుకోవద్దు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి