మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి మండలం సీపీఆర్ఐ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనర్కార్యాలయ నిర్మాణ పనులను సీపీ సుధీర్ బాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యత పాటిస్తూ త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ నిర్మాణం తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలన్నారు. నాణ్యత పాటించకపోతే కాంట్రాక్టర్ చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, మేడిపల్లి సీఐ పాల్గొన్నారు.
