25 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు

25 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదేండ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సీపీగెట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ర్టీ, బయోటెక్నాలజీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ తదితర ఐదేండ్ల కోర్సులకు ముందుగానే అడ్మిషన్లు చేస్తున్నట్టు చెప్పారు. 

ఈ మేరకు అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల 25,26 తేదీల్లో సీపీగెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవాలన్నారు. ఈ నెల28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని, సెప్టెంబర్ 1న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఉంటుందన్నారు. సెప్టెంబర్ 5 నుంచి సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాండు రంగారెడ్డి పేర్కొన్నారు.