హైదరాబాద్, వెలుగు: ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సీపీగెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. తొలి విడతలో మొత్తం 1,258 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 655 మందికి సీట్లు కేటాయించినట్టు సీపీజీఈటీ-–2025 కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి తెలిపారు.
సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫీజును చెల్లించి, నవంబర్19లోగా కేటాయించిన కాలేజీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు కాలేజీలో రిపోర్టింగ్ సమయంలో ఒరిజినల్ టీసీ మాత్రమే సమర్పించాలని కోరారు.
