
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 4 నుంచి ఎంట్రెన్స్ టెస్టు (సీపీగెట్) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 11 వరకు ప్రతిరోజూ మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్టు సీపీగెట్ కన్వనీర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. స్టేట్ వైడ్గా 44 పీజీ సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గురువారం నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://cpget.tgche.ac.in లేదా www.ouadmissions.com వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా63,089 మంది అటెండ్ కానున్నారని, వారికోసం 27 ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. సెంటర్ లొకేషన్ కోసం హాల్ టికెట్లపై తొలిసారిగా క్యూఆర్ కోడ్ ముద్రించామని, దాన్ని స్కాన్ చేస్తే సెంటర్ లోకేషన్ చూపిస్తుందన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంటన్నర ముందే రావాలన్నారు.