కరీంనగర్, వెలుగు: సీపీఐ వందేళ్ల సంబురాలను కరీంనగర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం భారీ ర్యాలీ అనంతరం రెవెన్యూ గార్డెన్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. దీంతో నగరంలోని ప్రధాన వీధులను ఎర్ర జెండాలతో అలంకరించారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు హాజరవుతారని కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. రెడ్ షర్ట్ వలంటీర్లు, డప్పు చప్పుళ్లు, కోలాట బృందాలు, కళాకారుల విప్లవ గేయాలతో భారీ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు.
