కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తుంది : బి.విజయసారథి

కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తుంది : బి.విజయసారథి

మహబూబాబాద్, వెలుగు: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పోరేట్​శక్తులకు దోచి పెడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. బుధవారం మహబూబాబాద్​లో సీపీఐ పట్టణ కౌన్సిల్​ మహసభలో ఆయన మాట్లాడుతూ పదకొండేండ్లలో దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు చేస్తూ విభజించి పాలిస్తూ దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలో అత్యధిక సీట్లు గెలిపించాలని ప్రజలను కోరారు.

సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధిరెడ్డి  మాట్లాడుతూ ఈనెల 5 ,6 న కురవిలో నిర్వహించే జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, నక్క నాగార్జున, మామిండ్ల సాంబలక్ష్మి వీరవెల్లి రవి, వెలుగు శ్రవణ్, ఎండీ ఫాతిమా, నర శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.