
కోల్బెల్ట్, వెలుగు: పేదలు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి.. కార్మికులు, కర్షకుల డిమాండ్లు, హక్కుల కోసం కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తున్నారని సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్ అన్నారు. జూన్1న రామకృష్ణాపూర్లో నిర్వహించే సీపీఐ పట్టణ మూడో మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం రామకృష్ణాపూర్లోని వరక్త, వాణిజ్య సముదాయాల్లో సీపీఐ, అనుబంధ సంఘాల లీడర్లు ప్రచారం చేశారు. మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. సీపీఐ పట్టణ సెక్రటరీ మిట్టపెల్లి శ్రీనివాస్, లీడర్లు వెంకటస్వామి, మిట్టపల్లి పౌలు, మామిడి గోపి, మాదాస్ శంకర్, పోతర్ల రాములు, రాజలింగు, కొమురయ్య, తోకల రాజన్న, రవి తదితరులు పాల్గొన్నారు.S