
శంషాబాద్/వికారాబాద్ : సీపీఐ ఆవిర్భావ వేడుకలను మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ రాజేంద్రనగర్ సెగ్మెంట్ కో కన్వీనర్ వనంపల్లి జైపాల్ రెడ్డి హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోనూ సీపీఐ ఆవిర్భావ వేడుకలను జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.