సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : చాడ వెంకటరెడ్డి

 సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి  : చాడ వెంకటరెడ్డి
  • ఆ పార్టీ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడే సీపీఐ బలపరిచే అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపించాలని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లూ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని విమర్శించారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి నిత్యం ప్రజల పక్షాన నిలబడే కమ్యూనిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అశోక్, లక్ష్మి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.