బీజేపీది డబ్బుతో కూడుకున్న రాజకీయం

బీజేపీది డబ్బుతో కూడుకున్న రాజకీయం

అమిత్ షా దేశ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. భారత ప్రజలు కమ్యూనిస్టులను దూరం పెట్టాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వామపక్షాలు లేని భారతదేశాన్ని ఊహించలేమన్నారు. దేశంలో అభివృద్ది బండి వెనకకుపోతుందని.. సరైన మార్గంలో నడిపించాలంటే కమ్యూనిస్టులు, మిత్ర పక్షాలు ఐక్యంగా ఉండాలని తెలిపారు. దేశంలో దోపిడి కొనసాగుతుందని.. ఈ దోపిడీ అరికట్టాలంటే కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందన్నారు.

తెలంగాణ పోరాటం విజయోత్సవ సభపై అన్ని పార్టీలతో పాటు ఎంఐఎం పార్టీ కూడా విజయోత్సవాలు నిర్వహిస్తామని తెలపడం.. సొమ్ము ఒకడిది సోకొకడిదిగా మారిందని సుధాకర్ రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే సాయుధ పోరాటంలో ఘన త్యాగాలు చేశారని విజయోత్సవాలు జరుపుకునే హక్కు కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉందన్నారు. బీజేపీది డబ్బుతో కూడుకున్న రాజకీయం అని.. తెలంగాణలో ఒక్క రాజకీయ పార్టీకి విమోచన దినాన్ని నిర్వహించే అర్హత లేదని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.