మోడీ అధికారంలోకి వచ్చాక దేశమంతటా అల్లకల్లోలాలే

మోడీ అధికారంలోకి వచ్చాక దేశమంతటా అల్లకల్లోలాలే

నరేంద్రమోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా అల్లకల్లోలాలు పెరిగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడా వెంకట్ రెడ్డి. సోమవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  హాల్లో మీటింగ్ లకు కూడా పోలీసులు అనుమతి కావాలని చెప్పడం పౌర హక్కులకు భంగం కలిగించినట్టేనని అన్నారు. CAA కు నిరసనగా మజ్లీస్ కు తప్ప మరెవ్వరి ర్యాలీలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్నారు. కన్హయ్య కుమార్ హాల్లో సమావేశానికి కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవసరమైతే కన్హయ్య కుమార్ సభను హై కోర్టు అనుమతితో హైదరాబాద్ లో  నిర్వహిస్తామన్నారు. వామపక్ష పార్టీలను అణిచివేసేందుకు TRS కుట్రలు చేస్తోందని, దీన్ని CPI తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు చాడా.

ఎంఐఎం కోరలు తీసిన పాము: నారాయణ

 

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా CAA ని తీసుకొస్తుందన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. కేంద్రం తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నయా నియంతృత్వ పాలన నడుస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో జరిగిన సీపీఐ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ… బీజేపీ, టీఆర్ఎస్ కు ఎంఐఎం అనుకూలమన్నారు. MIM కోరలు తీసిని నాగుపామని, ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని అన్నారు. కేసీఆర్ వీళ్ళను పెంచిపోసిస్తున్నారన్నారు.

సోమవారం జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటిపై మాట్లాడుతూ..  జగన్, కేసీఆర్ లు భేటి తెలంగాణ ఆంధ్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే భేటీ అని అన్నారు నారాయణ. ఆర్థిక నిపుణులు, సాగునీటి నిపుణులు లేకుండా సమావేశాలేంటని ప్రశ్నించారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నారన్నారు. ఏపీలో మిలటరీ పాలన కొనసాగుతోందన్నారు.