స్టార్‌‌‌‌ వైఫ్స్‌‌ సీక్రెట్స్‌‌పై ‘ది వైవ్స్‌‌’ సినిమా

స్టార్‌‌‌‌ వైఫ్స్‌‌ సీక్రెట్స్‌‌పై ‘ది వైవ్స్‌‌’ సినిమా

ఛాందిని బార్, పేజ్ 3, ఫ్యాషన్, క్యాలెండర్‌‌‌‌ గర్ల్స్‌‌, హీరోయిన్‌‌ లాంటి చిత్రాలతో గ్లామర్‌‌‌‌ ప్రపంచం వెనకున్న చీకటి కోణాలను తెరపై ఆవిష్కరించారు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్. ఇప్పుడు ఆయన మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘ది వైవ్స్‌‌’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాను మంగళవారం ముంబైలో ప్రారంభించారు. సోనాలి కులకర్ణి, మౌని రాయ్, రెజీనా కసాండ్రా, రాహుల్ భట్, సౌరభ్ సచ్‌‌దేవ, అర్జన్ బజ్వా, ఫ్రెడ్డీ దరువాలా ఇందులో నటిస్తున్నారు.

సొసైటీలోని మరో గ్లామరస్‌‌ లేయర్‌‌ వెనుక ఉన్న నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నానని, తరచుగా కనిపించే మహిళ జీవితంలోని సీక్రెట్స్‌‌, స్ట్రగుల్స్‌‌ను ఇందులో బోల్డ్‌‌గా ప్రజెంట్ చేయబోతున్నట్టు మధుర్ భండార్కర్ తెలియజేశారు. బాలీవుడ్‌‌ స్టార్‌‌‌‌ వైఫ్స్‌‌ రహస్య ప్రపంచంలోని స్కాండల్స్‌‌, గాసిప్స్‌‌, లగ్జరీ లైఫ్‌‌ను ఈసారి మధుర్ టార్గెట్‌‌ చేస్తున్నారు.  గతంలో ఆయనతో కలిసి ‘ఇండియా లాక్‌‌డౌన్‌‌’ చిత్రాన్ని నిర్మించిన ప్రణవ్ జైన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.