Kiran Abbavaram: కెమెరా అసిస్టెంట్‌ని హీరోని చేసిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: కెమెరా అసిస్టెంట్‌ని హీరోని చేసిన కిరణ్ అబ్బవరం..!

వరుస చిత్రాలతో హీరోగా రాణిస్తున్న కిరణ్‌‌‌‌ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగానూ మరో అడుగు ముందుకేస్తున్నాడు.  ‘కె.ఎ.’ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సినిమాలు నిర్మించబోతున్నాడు.  తన గత చిత్రాలకు కెమెరా అసిస్టెంట్‌‌‌‌గా పనిచేసిన రామ్ చరణ్‌‌‌‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా స్టార్ట్‌‌‌‌ చేయబోతున్నాడు. 

 ప్రీ ప్రొడక్షన్‌‌లో ఉన్న ఈ మూవీ షూటింగ్‌‌ ఈ ఏడాది చివర్లో  ప్రారంభం కానుంది.  ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ‘ఏడేళ్ల క్రితం ఓ పట్టుదల, డ్రీమ్‌‌‌‌తో నా ప్రయాణం ప్రారంభించి ప్రేక్షకుల ఆదరణతో గుర్తింపును అందుకున్నాను.  నాలాగే ఓ కలతో ఇండస్ట్రీకి వచ్చే యంగ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌కు మా బ్యానర్‌‌‌‌‌‌‌‌ ద్వారా అవకాశాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈనెల 10న సినిమాను అనౌన్స్‌‌‌‌ చేయబోతున్నాం’ అని చెప్పాడు.