బెంగళూరులో టీఎన్‌‌‌‌ఐటీ మీడియా అవార్డ్స్

బెంగళూరులో టీఎన్‌‌‌‌ఐటీ మీడియా అవార్డ్స్

టీఎన్‌‌‌‌ఐటీ మీడియా అవార్డ్స్ ఈవెంట్‌‌‌‌ను  ఆగస్టు 23న  బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌‌‌‌లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం  సౌత్ ఇండియా నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నట్టు, ప్రతి మీడియా చానెల్ తమ టీంకు అప్లికేషన్లు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు సీఈవో రఘు బట్. సౌత్ ఇండియా నుంచి జ్యూరీ సభ్యులుగా శుభలేఖ సుధాకర్, ఉత్తేజ్, ప్రభు వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు  మలయాళ,  కన్నడ, తమిళ భాషల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.  నటీనటులకు ఐఫా, సైమా లాంటి అవార్డ్స్ ఉన్నట్లే, మీడియాకి కూడా అంతే స్థాయిలో గుర్తింపు రావాలని ఆశిస్తున్నట్టు మార్కెటింగ్ హెడ్ ఖుషీ అన్నారు.