
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో నిర్విరామంగా శ్రమిస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన పెండింగ్ జీతాలను మంగళశారం (జులై 08) ఆర్థికశాఖ విడుదల చేసింది. రూ.150 కోట్ల నిధులను వేతనాల కోసం మంజూరు చేసింది.
బుధవారం (జులై 09) గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53 వేల మంది వర్కర్ల కు జీతాలు అందనున్నాయి. జీతాలు మంజూరు చేయడంపై మల్టీ పర్పస్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు కూడా అందిస్తామని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన తెలిపారు.