సీపీఐ నారాయణ సంక్రాంతి సంబరాలు

సీపీఐ నారాయణ సంక్రాంతి సంబరాలు
  • 40ఏళ్ల తర్వాత సొంతూరులో నారాయణ సంబరాలు

ఊరువాడా భోగి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. వీఐపీలు, ప్రముఖులు సొంతూళ్లలో సంబురాలు చేసుకుంటున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నగరి నియోజవకవర్గంలోని తన సొంతూరు అయానంబాకంలో వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని అందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. 40 ఏళ్ల తర్వాత సొంత ఊర్లో పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు నారాయణ.