ఆర్టీసీని నమ్ముకుని బతుకుతున్న 50 వేల కుటుంబాలకు అన్యాయం చేస్తూ ప్రైవేటు బస్సులను రోడ్డు మీదకు తీసుకొస్తే వాటిని అక్కడే కాలబెడతామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ డిపోతో పాటు జనగామలో ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి సందర్శించారు. కార్మికుల కాలుకు ముల్లు గుచ్చితే పంటితో పీకుతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు అదే పంటితో పీక నొక్కేయాలని చూస్తున్నాడన్నారు.
