కవిత సీబీఐ విచారణను లైవ్ ఇవ్వాలి: సీపీఐ నారాయణ

కవిత సీబీఐ విచారణను లైవ్ ఇవ్వాలి:  సీపీఐ నారాయణ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ లైవ్ పెట్టాలని సీపీఐ  జాతీయ కార్యదర్శి నారాయణ దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేయగా లేనిది.. సీబీఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటంలో ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేయటాన్ని నారాయణ ఖండించారు. 

కవితను విచారిస్తున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఈ కేసులో కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 CRPC కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు వెళ్తామని సీబీఐ అధికారులు తెలిపారు. తమ అడ్వకేట్ సమక్షంలో స్టేట్ మెంట్ ను ఎమ్మెల్సీ కవిత ఇస్తున్నారని తెలుస్తోంది. 

భారీ బందోబస్తు

సీబీఐ విచారణతో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. TRS కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లిక్కర్ కేసులో సీబీఐ విచారణ ఉండటంతో..శనివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయి చర్చించినట్లు తెలుస్తోంది.