
డ్రోన్ హబ్ గా కర్నూలు మారబోతోందని.. అలాగే సబ్ సీ కేబుల్ వ్యవస్థకు వైజాగ్ గేట్ వే అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గురువారం (అక్టోబర్ 16) కర్నూలులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతోందని అన్నారు.
అంతకు ముందు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు మోదీ.. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనతంతరం కర్నూలు బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా 2047 వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ సహకరిస్తోందని అన్నారు మోదీ. ఏపీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో శక్తవంతమైన నాయకత్వం ఉందని అభినందించారు. గత రెండేళ్లుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ దూసుకుపోతోందని అన్నారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని కామెంట్స్:
- శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం తీసుకోవడం ఆనందంగా ఉంది
- సోమనాథుడు కొలువైన గడ్డపై పుట్టాను
- విశ్వనాథుడికి సేవచేసే భాగ్యం దక్కింది
- 2047 నాటికి వికసిత్ భారత్ గా దేశం ఎదుగుతుంది
- ఈ 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం
- రోడ్లు, రైల్వేలతో సహా.. అన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నాం
- 16 నెలల్లో అభివృద్ధి డబుల్ ఇంజిన్ లా దూసుకుపోతోంది
- ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి
- అభివృద్ధి కోసం ఢిల్లీ అమరావతి కలిసి పనిచేస్తున్నాయి
- ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఇందన భద్రత చాలా అవసరం
- విద్యుత్ రంగంలో 3 వేల కోట్లతో ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం
- క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ వరకు అన్నీ రంగాల్లో రికార్డులు
- కాంగ్రెస్ హయాంలో తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కూడా లేదు
- నేడు తలసరి విద్యుత్ వినియోగం 1400 యూనిట్లు
- దేశంలో ప్రతీ గ్రామంలో విద్యుత్ సరఫరా ఉంది
- యూపీఏ హయాంలో విద్యుత్ సంభాలు కూడా లేవు
- ఇంధన విప్లవానికి ఏపీ ప్రధాన కేంద్రంగా ఉంది
- శ్రీకాకులం నుంచి అంగుల్ వరకు సహజవాయు పైప్ లైన్
- సహజవాయువుతో 15 లక్షల ఇండ్లకు గ్యాస్ సరఫరా
- వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్ సహకరిస్తుంది
- వికసిత్ భారత్ సాధించేందుకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాం
- గూగుల్ సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ పెట్టుబడులు ఏపీలో పెట్టింది
- విశాఖలో ఏఐ, సబ్ సీ కేబుల్, డేటా సెంటర్ మొదలైన భారీ ప్రాజెక్టులు
- దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరం..
- అలాగే ఏపీ అభివృద్ధికి రాయసీమ అభివృద్ధి కూడా అవసరం
- కర్నూలు నుంచే రాయలసీమ అభివృద్ధి మొదలైంది
- ఓర్వకల్ టు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్
- నిమ్మలూరులో నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు
- ఇది రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించబోతోంది
- కర్నూలును డ్రోన్ హబ్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది
- ఆపరేషన్ సిందూర్ లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి
- గత ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశాయి
- ఇప్పుడు ఎన్డీఏ హయాంలో ఏపీ ముఖచిత్రం మారబోతోంది.
- దేశంలో 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నుల లేకుండా చేశాం