వెస్టిండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా టీమిండియా ఆస్ట్రేలియా టూర్ కు బయలుదేరింది. బుధవారం (అక్టోబర్ 15) ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి భారత జట్టు రెండు బ్యాచ్ లుగా ఆస్ట్రేలియా చేరుకుంది. ఉదయం వెళ్లిన బ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ సహా మిగిలిన ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్సాయంత్రం మరో బృందంగా బయల్దేరింది.
ఈ నెల19న పెర్త్‌లో జరిగే తొలి వన్డేతో ఈ టూర్ మొదలవనుంది. ఆ తర్వాత అడిలైడ్, సిడ్నీలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టిన వెంటనే స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఒక్క రోజు రెస్ట్ లేకుండానే నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు. ఫీల్డింగ్ లోనూ క్యాచ్ లు పడుతూ బిజీగా గడిపాడు. అన్నిటికి మించి కోహ్లీ స్లిమ్ లుక్ లో అదిరిపోయాడు. తన ఫిట్ నెస్, ఎనర్జీతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాడు. ఏడు నెలల తర్వాత కోహ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది.
వన్డే సిరీస్ తర్వాత ఈనెల29 నుంచి ఐదు టీ20ల సిరీస్ కూడా జరగనుంది. టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండ్స్ కోహ్లీ, రోహిత్ చాన్నాళ్ల తర్వాత ఇండియా జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనుండటంతో వన్డే సిరీస్‌పై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్ ఇద్దరి వన్డే ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడమే తన లక్ష్యమని ఇప్పటికే పరోక్షంగా తన అభిప్రాయాన్ని తెలిపాడు.
Virat Kohli getting ready for a batting session.
— ` (@KohliHood) October 16, 2025
Virat Kohli is practicing a lot for Shot-balls and Off-side balls today. pic.twitter.com/WEyp9DUcq5
పోరాటం ఆగదు:
ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ వన్డేలకు కూడా వీడ్కోలు పలుకుతాడని.. ఆస్ట్రేలియా వన్డే సిరీసే కోహ్లీకి చివరిదని ప్రచారం జరుగుతోంది. కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటం డౌటేనని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కోహ్లీ అభిమానులు గందరగోళానికి గురైతున్నారు.
ఇక తమ అభిమాన ఆటగాడిని గ్రౌండ్లో చూడలేమా అని బాధపడుతున్నారు. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ గురించి పుకార్లు షికార్లు చేస్తోన్న వేళ విరాట్ క్లోహీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్లు’’ అని ఆసక్తికర ట్వీట్ చేశాడు కోహ్లీ. ఈ ట్వీట్ చూసిన కోహ్లీ అభిమానులు సంబరపడుతున్నారు.
Catch Practice with Fielding Coach. pic.twitter.com/duXVye8GtN
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 16, 2025
