
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటాడని అన్నారు. సనాతన ధర్మాన్ని సమర్దించే పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది, ఎవరు దాన్ని సమర్ధించినా వాళ్ళను అరెస్ట్ చేయాలంటూ సంచలన డిమాండ్ చేశారు నారాయణ.
సనాతన ధర్మంలో ఒకసారి పెళ్ళైన తర్వాత భర్త ఎంత వేధించినా.. జీవితాంతం అతనితోనే కాపురం చేయాలని.. చివరికి భర్త చనిపోతే అదే చితిమీద భార్యను కూడా తగలబెట్టడం సనాతన ధర్మం సారాంశమని అన్నారు నారాయణ. సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని మాత్రమే తానూ ప్రశ్నించానని.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తేలేదని అన్నారు నారాయణ.
సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారని.. కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని అన్నారు నారాయణ. నారాయణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు నారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని.. నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.