కేంద్రానికి సీపీఐ నారాయణ లేఖ

కేంద్రానికి సీపీఐ నారాయణ లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ హాస్టల్లో సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని, అంతర్జాతీయ, జాతీయ స్థాయికి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​కు ఆయన లేఖ రాశారు. వర్సిటీలో రెగ్యులర్ వీసీ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోందని, దీంతో విద్యార్థులపై అధికారుల వేధింపుల పెరిగాయని లేఖలో పేర్కొన్నారు. అందుకే వర్సిటీకి రెగ్యులర్​ వీసీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 200కి పైగా లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అన్ని తరగతులు, ప్రాక్టికల్స్ జరిగేలా పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలని కోరారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించడంతో నాసిరకమైన భోజనం అందుతోందని, దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల కిందే 600 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్​తో అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.