
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్ల శ్రీనివాస్
శంషాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు సీపీఐ వ్యతిరేకించందని, అయినా ఆయన పట్టించుకోకుండా.. తానే ఒక ఇంజినీర్లా నిర్ణయాలు తీసుకొని, నిర్మాణం పూర్తి చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్ల శ్రీనివాస్అన్నారు. ప్రాజెక్టు కుంగితే ఆయన తనకు సంబంధం లేదనడం సరికాదని పేర్కొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎలైట్ హోటల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రాజెక్టు పరిస్థితి, భవిష్యత్‌లో ఏం చేయాలో చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను ఆపేయాలని డిమాండ్‌చేశారు. ప్రైవేట విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు, మండల కార్యదర్శి నర్రా గిరి, సహాయ కార్యదర్శి ప్రభు, ఏఐటీయూసీ కార్యదర్శి రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి నరేశ్తదితరులున్నారు.