మేం తలుచుకుంటే అధికారం తారుమారు : కూనంనేని సాంబశివరావు

మేం తలుచుకుంటే అధికారం తారుమారు : కూనంనేని సాంబశివరావు

పొత్తులపై సీపీఐ రాష్ట్ర కారదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలు తలుచుకుంటే రాష్ట్రంలో అధికారం తారుమారు అవుతుందని చెప్పారు. సీట్ల పంపకాలపై ఇప్పటివరకు బీఆర్ఎస్ తో చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులకు కేటాయించే సీట్లపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతామని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు సీట్లు ఇవ్వరంటూ వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కోరుతామనేది ఎన్నికల సమయంలో మాత్రమే బయటకు చెబుతామన్నారు. రాష్ట్రంలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఉంటోందని తెలిపారు. కొత్తగూడెం సీటు విషయంలో తాను స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘బీఆర్ఎస్ తో పొత్తు పొత్తే.. ఆ పార్టీతో పోరాటం పోరాటమే’ ఉంటుందన్నారు. దేశానికి ప్రమాదంగా మారిన బీజేపీని నిలువరించేందుకే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతు తెలిపామని మరోసారి చెప్పారు.