మతోన్మాదానికి వ్యతిరేకంగా లాల్​ నీల్​ శక్తులు పోరాడాలి

మతోన్మాదానికి వ్యతిరేకంగా లాల్​ నీల్​ శక్తులు పోరాడాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు 

ముషీరాబాద్, వెలుగు: మతోన్మాదానికి వ్యతిరేకంగా లాల్ నీల్ శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. అసమానతలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా పోరాడాలన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారితపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్ లో దళితులకు 5 శాతం నిధులు కూడా కేటాయించలేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని అవమానించేలా బీజేపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మార్క్స్, ఫూలే, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, సీనియర్ దళిత నేత జేబీ రాజు, జాతీయ అంబేద్కర్ సంస్థ నేత నర్సింగ రావు, ప్రొఫెసర్ తడ్క యాదగిరి, టీపీఎస్ ప్రతినిధి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు.