బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనియ్యం

బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనియ్యం

కూసుమంచి, వెలుగు: మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్​తో పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం కూసుమంచి మండలంలోని మల్లేపల్లిలో ఇటీవల మృతి చెందిన సీపీఎం నాయకుడు కట్టా పుల్లయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి, నివాళి అర్పించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం సరి కాదన్నారు. బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనియ్యమని అన్నారు. తెల్దారుపల్లి హత్యకు సీపీఎంకు సంబంధం లేదన్నారు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందన్నారు. తెల్దారుపల్లి ఘటన గురించే టీఆర్ఎస్ తో పొత్తు అనేది రాజకీయ మూర్ఖులు చేసే ఆరోపణ అన్నారు.