ఇయ్యాల్టి నుంచి గాంధీ ఆస్పత్రిలో సీపీఆర్​ ట్రైనింగ్​ క్యాంప్

ఇయ్యాల్టి నుంచి గాంధీ ఆస్పత్రిలో సీపీఆర్​ ట్రైనింగ్​ క్యాంప్

పద్మారావునగర్, వెలుగు : అకస్మాత్తుగా గుండెపోటు (కార్డియక్​ అరెస్ట్​)కు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడే కార్డియో పల్మనరి రెస్క్యూటేషన్​ (సీపీఆర్)పై గాంధీలో ఇయ్యాల, రేపు అవగాహన కల్పించనున్నారు. గాంధీ అలుమ్ని ఎడ్యుకేషన్​ సెంటర్​లో మెడికల్​కాలేజీ అలూమ్ని అసోసియేషన్, గాంధీ గ్లోబల్ అలయెన్స్​ ఆధ్వర్యంలో ఉచిత సీపీఆర్ ​ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు.

కార్డియాక్​అరెస్ట్  అయిన వెంటనే  చేతుల ద్వారా బాధితుడి గుండెపై నొక్కినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చని గాంధీ అలుమ్ని ప్రెసిడెంట్ డా.జి.ఆర్​. లింగమూర్తి, సెక్రటరీ డా. ఏవీ.రత్నం తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే సీపీఆర్​ ట్రైనింగ్ క్యాంపునకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క సిటిజన్​ హాజరు కావాలని కోరారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఓ డాక్టర్​గా ఎదుటి వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు.