ఇవాళ సీపీఎస్‌‌ ఉద్యోగుల చలో హైదరాబాద్‌‌: సీపీఎస్ఈయూ

ఇవాళ సీపీఎస్‌‌ ఉద్యోగుల చలో హైదరాబాద్‌‌: సీపీఎస్ఈయూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ (సీపీఎస్‌‌) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ చలో హైదరాబాద్‌‌ కార్యక్రమానికి సీపీఎస్‌‌ఈయూ పిలుపునిచ్చింది. శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌‌ గ్రౌండ్‌‌లో మధ్యాహ్నాం 3 గంటలకు పాత పింఛన్ సాధన సాకార సభ నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాపురం స్థితప్రజ్ఞ, కల్వల శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్రంలో 1.72 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని, వారి భవిష్యత్ కోసమే ఈ పోరాటమని పేర్కొన్నారు. ఇటీవల రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్‌‌, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. తెలంగాణలోనూ అదేవిధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎస్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో హాజరుకావాలని కోరారు. ఇతర రాష్ట్రాల సీపీఎస్ ఉద్యోగుల ప్రతినిధులు, టీచర్ల సంఘాల ప్రతినిధులు ఈ సభకు అటెండ్ అవుతున్నారని చెప్పారు.