క్రాక్‌‌ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

క్రాక్‌‌ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

శక్తి, ఊసరవెల్లి, తుపాకి లాంటి సౌత్‌‌ సినిమాల్లో విలన్‌‌గా నటించిన విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘క్రాక్‌‌’. ఆదిత్యా దత్ దర్శకుడు. అర్జున్ రాంపాల్, అమీజాక్సన్, నోరా ఫతేహి కీలకపాత్రలు పోషించారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.

ముంబై స్లమ్‌‌లో ఉండే ఓ సాధారణ యువకుడు.. సీక్రెట్‌‌ ప్లేస్‌‌లో జరిగే డేంజరస్‌‌ రేసింగ్‌‌ పోటీల్లో పాల్గొనాల్సి వస్తుంది. చావు, బ్రతుకుల మధ్య జరిగే ఆ పోటీల్లో అతను ఎలా సక్సెస్ అయ్యాడు అనేది మెయిన్ కాన్సెప్ట్‌‌. కార్లు, బైకులతో సాగే రేసులు, గాల్లో చేసే విన్యాసాలు, రిస్కీ ఫైటింగ్‌‌ సీక్వెన్సులతో ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.  బిగ్గెస్ట్‌‌ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.