సినీ పోలిస్తో క్రాక్స్ ఒప్పందం.. సినిమా లవర్స్కు కొత్త తరహా స్నాక్స్

సినీ పోలిస్తో క్రాక్స్ ఒప్పందం.. సినిమా లవర్స్కు కొత్త తరహా స్నాక్స్

హైదరాబాద్​, వెలుగు: సినిమా లవర్స్​కు కొత్త తరహా స్నాక్స్​ అందించడానికి సినీ పోలిస్​, క్రాక్స్ చేతులు కలిపాయి. కొత్త ఫ్లేవర్​తో కూడిన పాప్‌‌కార్న్‌‌ను విడుదల చేశాయి. సినిమా చూసేటప్పుడు స్నాక్స్‌‌లో కొత్త అనుభూతిని అందించేందుకు ఈ రెండు కంపెనీలు తొలిసారిగా జతకట్టాయి. క్రాక్స్​ చీజ్‌‌బాల్స్‌‌ రుచిని సినీపోలిస్​​ పాప్‌‌కార్న్‌‌తో కలిపి ఈ కొత్త ఫ్లేవర్‌‌ను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీపోలిస్​​ ఔట్‌‌లెట్లలో ఇది లభిస్తుందని సినీపోలిస్ ఎండీ దేవాంగ్​సంపత్ చెప్పారు.