ఓకే ఫ్రేమ్ లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్

ఓకే ఫ్రేమ్ లో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్

ఒకప్పుడు బాలీవుడ్ అంటే.. చాలా పెద్ద అనే ఫీలింగ్ ఉంది. అది నటుల విషయంలో కావచ్చు. వారికిచ్చే రెమ్యునరేషన్ల విషయంలో కావచ్చు. అదీ కాదంటే మూవీ బడ్జెట్ విషయంలో కావచ్చు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. దానికి ఈ మధ్య టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు, బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తున్న వసూళ్లే కారణం. దీంతో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా ఇప్పుడు హీరోల మధ్య బాండింగ్ ముందు కంటే ఇప్పుడు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు సత్సంబంధాలను మెయిన్ టైన్ చేస్తుంటారు. మొన్నటికిమొన్న విక్రమ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ అనంతరం, కమల్ హాసన్, చిరు కలిసి  సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే అలాంటిదే మరొక ఇంట్రస్టెంగ్ ఘటన చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే... ఒకే ఫ్రేమ్ లో విక్టరీ వెంకటేశ్, మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ లు ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ముగ్గురితో పాటు మరొక వ్యక్తి కూడా ఈ పిక్ లో ఉండడంతో.. ఆ వ్యక్తి ఎవరా అనే ప్రశ్న అందర్నీ వెంటాడుతోంది. ఇంతకీ అతనెవరనుకున్నారు. జేసీ పవన్ రెడ్డి. అందరికీ తెలిసే విధంగా చెప్పాలంటే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు. ఆయనే ఈ ముగ్గురి కలయికకు కారణమైనట్టు తెలుస్తోంది. వీరంతా కలిసి పవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఓ పార్టీలో కలిసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పలు ఫొటోలను జేసీ పవన్ రెడ్డి షేర్ చేయడంతో.. ఇప్పుడు ఈ టాపిక్ సెన్సేషన్ గా మారింది.  అసలు ఈ ముగ్గురు ఇలా కలవడానికి కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే... చిరంజీవి నటిస్తున్న గ్రాండ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనుండగా.. సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ కభీ ఈద్ కభీ దివాళీలో వెంకీ అతిథి పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నాడట. వెంకీ పాత్ర నిడివి చిన్నదే అయినా.. ముఖ్యమైన పాత్ర అని సమాచారం. ఏదేమైనా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఇలా ఒకే ఫ్రేములో కనిపించడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.