
హైదరాబాద్, వెలుగు: చిన్న వ్యాపార యజమానులను కంటెంట్ క్రియేటర్లుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మార్చేందుకు సాయపడతామని హైదరాబాద్‌కు చెందిన క్రియేటర్వర్స్ ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 30న బూట్‌క్యాంప్ నిర్వహిస్తామని తెలిపింది. చిన్న వ్యాపారాల యజమానులు, నిపుణులు తమ సొంత కథల ద్వారా తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకోవచ్చని పేర్కొంది.
వీళ్లు వీడియో కంటెంట్ సృష్టికర్తలుగా మారడానికి వేదికగా పనిచేస్తామని తెలిపింది. వీడియోలు తీయడం, స్క్రిప్ట్‌లు రాయడం, కెమెరా ముందు నడచుకునే విధానం, తదితర విషయాలపై శిక్షణ ఇస్తారు. ఇందుకోసం బూట్‌క్యాంప్‌లు నిర్వహిస్తారు. కేవలం వీడియోల తయారీ నేర్పించడమే కాకుండా, వారిని వారి స్వంత బ్రాండ్ అంబాసిడర్‌లుగా మార్చుతామని క్రియేటర్వర్స్ తెలిపింది.