2030 నాటికి 4000 గ్రీన్ ప్రాజెక్టులు.. క్రెడాయ్​తో ఐజీబీసీ ఒప్పందం

2030 నాటికి 4000 గ్రీన్ ప్రాజెక్టులు..  క్రెడాయ్​తో ఐజీబీసీ ఒప్పందం

2030 నాటికి 4000 గ్రీన్ ప్రాజెక్టులు
క్రెడాయ్​తో ఐజీబీసీ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు : రియల్ ఎస్టేట్ బాడీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)  పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణం కోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)తో దేశ వ్యాప్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది.  ఐజీబీసీతో కలిసి  గ్రీన్ & నెట్ జీరో బిల్డింగ్ రేటింగ్స్​ ఇవ్వడం ద్వారా భారతదేశం అంతటా వచ్చే 2 సంవత్సరాల్లో 1000 సర్టిఫైడ్ గ్రీన్ ప్రాజెక్ట్‌‌‌‌లను అందుబాటులోకి తెస్తామని క్రెడాయ్​ తెలిపింది.

 2030 నాటికి 4000 ప్రాజెక్ట్‌‌‌‌లను నిర్మిస్తామని ప్రతిజ్ఞ  చేసింది.  దేశవ్యాప్తంగా గ్రీన్ డెవలప్‌‌‌‌మెంట్ కేటగిరీలో 4,00,000 హౌసింగ్ యూనిట్లు అదనంగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లకు ఐజీబీసీ సర్టిఫికేషన్​ ఉంటుంది. క్రెడాయ్ ఇన్వెస్టిచర్ వేడుక సందర్భంగా  2023–-25 వరకు క్రెడాయ్ నేషనల్‌‌‌‌‌‌కు కొత్త ప్రెసిడెంట్​గా బొమన్ ఇరానీ నియమితులయ్యారు.