క్రెడిబిలిటీని కాపాడుకోవాలి.. ఫేక్ న్యూస్ తో జాగ్రత్తగా ఉండాలి

క్రెడిబిలిటీని కాపాడుకోవాలి.. ఫేక్ న్యూస్ తో జాగ్రత్తగా ఉండాలి
  • సౌత్ ఇండియా మీడియా సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గవర్నర్ తమిళిసై
  • ఫేక్ న్యూస్​తో జాగ్రత్తగా ఉండాలి: వివేక్​ వెంకటస్వామి
  • మీడియా సంస్థలు కాంట్రవర్సీలకే ప్రాధాన్యమివ్వొద్దని సూచన
  • ఫేక్ న్యూస్​ స్ప్రెడ్ అవుతున్నది: వివేక్​ వెంకటస్వామి
  • తనపైనా సోషల్​ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: మీడియా సంస్థలు క్రెడిబిలిటీని మెయింటైన్​చేయాలని గవర్నర్ తమిళిసై అన్నారు. కేవలం కాంట్రవర్సీలకే ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు. హైదరాబాద్‌‌లోని ఓ హోటల్‌‌లో ఏర్పాటు చేసిన ‘సౌత్ ఇండియా మీడియా సమ్మిట్‌‌’ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ‘‘ఇప్పుడు సోషల్​మీడియా హవా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరిపై దాని ప్రభావం ఉంది. మీడియా ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రతి రంగాన్ని టెక్నాలజీ ఓవర్‌‌‌‌ టెక్​ చేస్తున్నట్టే మీడియా రంగంలోనూ ఆ ప్రభావం కనిపిస్తున్నది. ఫీల్డ్‌‌లో జర్నలిస్టులకు ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కొంత మంది లీడర్లు మీడియాను అవైడ్ చేస్తున్నరు” అని చెప్పారు. మీడియా ఎల్లవేళలా ప్రజల పక్షపాతిగానే ఉండాలన్నారు. 

రాబోయే కాలంలో మీడియా రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అన్నారు. ఇండియన్ మీడియా ఇండస్ట్రీలో సౌత్​ఇండియా మీడియా ఇండస్ట్రీ 15 శాతం గ్రోత్​సాధించడం మంచి పరిణామమన్నారు. ‘‘ఉత్తరాది రాజకీయ నాయకులు, ఉత్తరాది మీడియాతో పోల్చినప్పుడు దక్షిణాది మీడియా, రాజకీయనేతలకు గుర్తింపు ఉందా అనేది ప్రశ్నార్థకమే. నాకే ఇలాంటి అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్​లో నిర్వహించిన గవర్నర్ల కాన్ఫరెన్స్​కు నేను వెళ్తే అక్కడి వాళ్లు నన్ను గుర్తుపట్టలేదు. కనీసం రిసీవ్​కూడా చేసుకోలేదు” అని అన్నారు.

మీడియాలో విశ్వసనీయత ముఖ్యం: వివేక్ వెంకటస్వామి
విశాక ఇండస్ట్రీస్ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉందని ఆ సంస్థ చైర్మన్ వివేక్ ​వెంకటస్వామి అన్నారు. ఈ క్రెడిట్ ​తమ టీమ్​మెంబర్లదేనని చెప్పారు. ‘‘మా సంస్థలో పని చేసే వాళ్లు.. మార్కెట్ నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్​బ్యాక్ ​తీసుకుంటూ మంచి ప్రొడక్ట్స్ తీసుకు వస్తున్నారు. సిమెంట్, ఫ్లై యాష్, కర్రల గుజ్జుతో తయారు చేసిన వీ బోర్డుకు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్​ఉంది. మూడేళ్లలోనే ఈ ప్రొడక్ట్​దేశంలోనే అత్యధిక డిమాండ్​సొంతం చేసుకుంది. ఆటమ్​సోలార్​రూఫ్ కు మంచి ఆదరణ లభిస్తోంది. నా కుమారుడు, వాళ్ల టీమ్ ఈ ప్రొడక్ట్​తో పాటు ఆటమ్​ ఎలక్ట్రిక్​బైక్​ను తీసుకువచ్చింది. ఆటమ్ ​రూఫ్​తో కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు ఇందుకోసం పెట్టిన పెట్టుబడిని మూడు, నాలుగేళ్లలోనే తిరిగి రాబట్టుకోగలుతారు. ఇతర ఉత్పత్తులతో పోల్చినప్పుడు  మా ఉత్పత్తుల క్వాలిటీ ఎంతో మెరుగ్గా ఉంటుంది” అని వివరించారు. 

మీడియాలో విశ్వసనీయత చాలా ముఖ్యమని చెప్పారు. సోషల్, డిజిటల్ ​మీడియాలో చాలా ఫేక్​ న్యూస్​ స్ప్రెడ్​అవుతున్నాయని, తనపైనా సోషల్ ​మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి గాసిప్స్‌‌ను వ్యూయర్స్​ కూడా చాలా ఎంజాయ్​చేస్తున్నట్టున్నారని, అందుకే వాటికి అంతగా వ్యూయర్​షిప్​ ఉంటోందని అన్నారు. మీడియా సెక్టార్​చాలెంజింగ్​గా మారిందని, ఈ రంగంలో క్వాలిటీతో పాటు డిగ్నిటీ, డిసిప్లేన్​ముఖ్యమన్నారు. వీ6, వెలుగు మీడియా తెలంగాణలో స్ట్రాంగ్​మీడియా అని అన్నారు. సమ్మిట్​లో అక్కినేని అమల, మీడియా, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.