షేన్‌ వార్న్‌ కు అరుదైన గౌరవం

 షేన్‌ వార్న్‌ కు అరుదైన గౌరవం

ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు  కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏటా అత్యుత్తమ పురుషుల టెస్టు క్రికెటర్‌ అవార్డును షేన్‌వార్న్‌ పేరిట ఇవ్వనుంది. వార్న్ గౌరవార్థం ఈ ఆవార్టుకు అతని పేరు పెట్టినట్లుగా ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో బాక్సింగ్‌ డే టెస్టు ప్రారంభం సందర్భంగా వార్న్‌కు నివాళిగా అవార్డుకు అతని పేరు పెడుతున్నట్లు సీఏ సీఈఓ నిక్‌ హాక్లే, ఆసీస్‌ క్రికెటర్ల సంఘం సీఈఓ టాడ్‌ గ్రీన్‌బెర్‌ ప్రకటించారు.  

లెగ్‌స్పిన్‌ దిగ్గజం వార్న్‌ 145 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు.  కాగా గతేడాది వార్న్ 52 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.   2005లో 40 వికెట్లు తీసిన వార్న్‌కు 2006లో ఈ అవార్డు లభించడం విశేషం.