350 దాటిన ఇంగ్లాండ్ స్కోరు.. 80 ఓవర్లకు స్కోరు 350/6.. బ్రూక్ వికెట్ పడగొడితేనే..

350 దాటిన ఇంగ్లాండ్ స్కోరు.. 80 ఓవర్లకు స్కోరు 350/6.. బ్రూక్ వికెట్ పడగొడితేనే..

ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 20 పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ నిలకడగా ఆడారు. బ్రూక్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 103 బంతుల్లో 83 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఉన్నాడు.

జామీ స్మిత్ కూడా 52 బంతుల్లో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడినప్పటికీ  రెండో సెషన్లో ప్రసీద్ కృష్ణ బౌలింగ్లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టడంతో జామీ స్మిత్ ఔట్గా వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. బుమ్రా 3 వికెట్లతో రాణించగా, ప్రసీద్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్కు ఒక వికెట్ దక్కింది.

ఇండియా, ఇంగ్లండ్‌‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌‌ రసవత్తరంగా సాగుతోంది. 80 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఇంగ్లండ్ జట్టు 121 పరుగులు వెనుకంజలో ఉంది. టీమిండియా కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (227 బాల్స్‌‌లో 19 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 147)కు తోడు, రిషబ్‌‌ పంత్‌‌ (178 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 134) కూడా సెంచరీతో  దుమ్మురేపడంతో.. శనివారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 113 ఓవర్లలో 471 రన్స్‌‌కు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా తక్కువేం కాదు. ఒలీ పోప్‌ 137 బంతుల్లో‌ 106 పరుగులతో సూపర్‌‌ సెంచరీ చేశాడు. ఒలీ పోప్ దూకుడుకు ప్రసీద్ కృష్ణ అడ్డు కట్ట వేశాడు.

ప్రసీద్ బౌలింగ్లో పంత్కు క్యాచ్గా దొరికిపోవడంతో 106 పరుగులతో ఒలీ పోప్ సరిపెట్టుకున్నాడు. బెన్ డకెట్ 62 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లు వికెట్‌ కోసం ట్రై చేసినా ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా నిలకడగా ఆడారు. ఆ టైంలోనే.. బెన్ స్టోక్స్ను, జామీ స్మిత్ను టీమిండియా బౌలర్లు ఔట్ చేశారు. దీంతో.. టీమిండియా భారీ ఊరట దక్కింది. హ్యారీ బ్రూక్ మాత్రం 92 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్తో 70 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు సవాల్ విసిరాడు.